“నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా… డైరెక్టర్

ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజుల నుంచి మా ఎలక్షన్లు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.ఒక ప్యానెల్ సభ్యుల గురించి మరొక ప్యానెల్ సభ్యులు చాలా తీవ్రంగా తిట్టుకుంటూ వారి రహస్యాలను కూడా మీడియా ముందు పెట్టేస్తున్నారు.. అంతే కాదు మాకు ఓటేయాలి అంటే మాకు ఓటేయాలి అంటూ రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు, మరొకవైపు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక యంగ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.. అతనెవరో కాదు ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. ఇతని దూకుడు మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆర్ఎక్స్100 సినిమా కి ముందు.. సినిమా సక్సెస్ కాకపోతే మా ఊరికి వెళ్లి గొర్రెలు కాసుకుంటానని కూడా శపదం చేశాడు.. కానీ అదృష్టవశాత్తు ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తన రెండవ సినిమా మహాసముద్రంలో నటించడానికి ఒక హీరో ముందు అంగీకరించి, తర్వాత హ్యాండ్ ఇవ్వడంతో ఆ స్టార్ హీరోను ఉద్దేశించి చీప్ స్టార్ అంటూ కూడా అప్పట్లో ఈయన చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి.

ఇప్పుడు మరోసారి మా ఎన్నికలను ఉద్దేశించి ” నాకు నచ్చిన ప్యానల్ కు మద్దతు ఇచ్చిన వారికే నా సినిమాలో క్యారెక్టర్ లు రాస్తా ” అని మరో ట్వీట్ కూడా చేశాడు అజయ్.. అజయ్ భూపతి ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం అయితే తెలియదు కానీ.. ఇలాంటి షాకింగ్ కామెంట్ చేయడంతో వర్మ శిష్యుడు అనిపించుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.