మోహన్ బాబు కారణంగా లైవ్ లోనే ఏడ్చేసిన బెనర్జీ..!

మా ఎన్నికల వేడి ప్రస్తుతం రగులుతూనే ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక ప్రకాష్ రాజు ఆధ్వర్యంలో అందరూ మీడియాతో మాట్లాడుతూఉన్నారు. ఈ సందర్భంగా బెనర్జీ చాలా ఎమోషనల్ అయ్యారు.”తను మూడు రోజుల నుంచి నిద్ర పోలేదట.”అందుకు కారణం మోహన్ బాబు గారు నన్ను తిట్టడమే అంటూ మీడియా ముందే తెలియజేశాడు.

- Advertisement -

ఆయన అలా ఎందుకు అన్నారు అర్థం కాలేదు దారుణంగా మాట్లాడాడు నేను ఎప్పుడూ ఇటువంటి మాటలు వినలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం ఎన్నికలలో పాల్గొన్నందుకు అన్ని మాటలు మాట్లాడతారా? మంచు విష్ణు వచ్చి నన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో దీనిని తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో మంచు లక్ష్మి ని ఎత్తుకొని తిరిగాను, విష్ణు బాబు ని కూడా ఎత్తుకొని తిరిగాను అలాంటి నన్ను మోహన్ బాబు బండ బూతులు తిట్టారు. కొట్టడానికి కూడా రావడంతో మంచు విష్ణు వచ్చి నన్ను పక్కకి లాగాడు అని తెలియజేశాడు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఈ విషయాలన్నీ తెలియజేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

Share post:

Popular