సలార్ సినిమాలో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సోలార్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించడానికి మరొక హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్ర కోసం 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ హోల్డర్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లో సలార్ సెట్స్ లో మీనాక్షి చౌదరి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఈ బామ్మ నక్క తోక తోక్కినట్లే నని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పాము లోకి వస్తున్న ఈ బ్యూటీ కి ప్రభాస్ సరసన నటించే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం లేదనే చెప్పాలి.ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా విడుదల అయ్యి మంచి టాక్‌ తెచ్చుకుంది.ఈ బ్యూటి ప్రస్తుతం ఖిలాడి,హిట్‌-2, లాంటి సినిమాలు చేస్తోంది.