చిరును అలా పిలిచిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు..మెగాస్టార్ ఆగ్ర‌హం!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పెళ్లిసంద‌D`. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీర‌గా, శ్రీ లీల హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి గౌరీ రోనంకి దర్శకత్వం వ‌హించారు. టీజర్, పాటలు, ట్రైలర్ ద్వారా భారీ అంచ‌నాల‌ను పెంచుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

Pelli Sandadi: శ్రీకాంత్ తనయుడి కోసం రంగంలోకి ఆ స్టార్ హీరోలు.. పెళ్లి సందD ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అతిథులు ఎవరంటే.. | megastar chiranjeevi and venkatesh chief guests for ...

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా.. చిరంజీవి, వెంక‌టేశ్ చీఫ్ గెస్టులుగా వ‌చ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో త‌న‌ను `చిరంజీవిగారు` అని రోష‌న్ పిల‌వ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. స్టేజ్‌పై రోష‌న్ మాట్లాడుతూ..‘మెగాస్టార్ చిరంజీవిగారు’ అని సంబోధించాడు.

Pellisanda D | పెళ్ళి సంద D

దాంతో వెంట‌నే మైక్ తీసుకున్న చిరు.. `ఏం రోష‌న్ న‌న్నే చిరంజీవిగారు అని పేరు పెట్టి పిలుస్తావా? ఏమ్మా ఊహా.. ఇదేనా నీ కొడుక్కి నేర్పించావు` అని స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు. అంతేకాదు, `నేను మీ నాన్నకు అన్నయ్యను.. నీకు పెద్దనాన్న అవుతాను. అలాగే పిలువు. నువ్వు అలా పిలిస్తే ఎంతో ఆప్యాయంగా అనిపిస్తుంది` అంటూ రోష‌న్‌కు స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి స‌ర‌దాగా అనిపించిన ఈ స‌న్నివేశం అక్క‌డ వారి చేత న‌వ్వులు పూయించింది.

Share post:

Popular