చాలా విషయాల్లో బైలాస్ మార్చాలి అనుకుంటున్న.. విష్ణు?

తాజాగా మంచు విష్ణు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నాడు. అనంతరం శ్రీ విద్యానికేతన్ లొ విష్ణువు తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. చాలా సందర్భాలలో బైలాస్ మార్చాడని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎవరు పడితే వాళ్ళు మా సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇక మా అధ్యక్షుడిగా తాజాగా విష్ణు ప్రమాణస్వీకారం ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

- Advertisement -

చాలా విషయాలలో అసోసియేషన్ లోని బైలాస్ ను మార్చాలి అనుకుంటున్నాను. అలాగే బైలాస్ మార్చడం అంటే అంత ఈజీ కాదని, ఈ విషయంపై సినీ పెద్దల తో మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎవరు పడితే వారు మా సభ్యులు కాకూడదని తాను భావిస్తున్నానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ ఓపెన్ చేయించారని, అందులోఅందులో మూడో వ్యక్తి ప్రశ్నించ లేదన్నారు. ఇక ఆ రోజు రాత్రి లేట్ అవ్వడంతో మరునాడు కౌంటింగ్ కొనసాగించారని తెలిపాడు.

Share post:

Popular