రాజీనామాలపై అప్పుడే స్పందిస్తా.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకున్నారు. మోహన్ బాబు మా నూతన కార్యవర్గం తో కలిసి సోమవారం ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విఐపి దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఆలయ అర్చకులు మంచు విష్ణు అని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. మంచు విష్ణు తో పాటు శివబాలాజీ,గౌతంరాజు,కరాటే కళ్యాణి, పూజిత మాణిక్, శ్రీనివాసులు ఉన్నారు.

ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ..మా కు అధ్యక్షుడిగా విష్ణు ఎన్నిక అవ్వడం చాలా సంతోషంగా ఉందని, మాకు అధ్యక్షుడు అంటే సాధారణ విషయం కాదని, ఇది ఒక బాధ్యత గౌరవప్రదమైన హోదా అని తెలిపారు.

 

ఆ తర్వాత విష్ణు మాట్లాడుతూ.. మా ఎన్నికల అనంతరం స్వామివారిని దర్శించుకున్నామని, అందరి కృషి వల్లే మేము గెలిచామని అన్నారు. అలాగే మెజారిటీ సభ్యులు తమ ప్యానల్ నుంచి గెలిచారని తెలిపారు.

ప్రకాశ్ రాజ్ చానల్ రాజీనామాలను చేస్తామని అన్నారు కానీ వాళ్ల నుంచి ఇప్పటివరకు ఎలాంటి రాజీనామా లేఖలు రాలేదని అతను తెలిపారు. ఆ లేఖలు వచ్చిన తర్వాత ఏం చేయాలో అన్నది ఆలోచిస్తామని తెలిపారు.

Share post:

Latest