‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందనడానికి సాక్ష్యాలివే : ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ స్టేషన్ మా ఎన్నికలు జరిగి దాదాపు రెండు వారాలు అవుతున్న పరిశ్రమలో ఇంకా వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. అయితే నటుడు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ
ఆరోపించారు . ఇటీవల పోలింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందని ఆరోపిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఎన్నికల హాల్లోకి కార్యకర్త సాంబశివరావును ఎలా అనుమతించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సాంబశివరావు వు ఎన్నికల హాల్లోని ఓటర్లను బెదిరించారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు.

‘ కృష్ణమోహన్ గారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే , ఇప్పటికైనా మాకు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి. ఎన్నికలు ఎలా జరిగాయి, పోలింగ్ బూత్ లో అసలు ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయడం ఇవ్వండి’ అని ప్రకాష్ రాజ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో మంచు విష్ణుతో కలిసి ఉన్న ఫోటోలను కృష్ణ మోహన్ కు పంపించారు. అలాగే దీనికి సంబంధించిన వీడియోలను కూడా త్వరలో బయటపెడతామని ప్రకాష్ రాజు వెల్లడించారు.

Share post:

Latest