మా ఎన్నికలలో మెగా హీరోలు పోటీ చేస్తే విష్ణు విత్డ్రా అవుతాడా..?

ప్రస్తుతం మా ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ అభ్యర్థుల మధ్య పోటాపోటీగా మాటల వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో మొదటిసారి నటులు ఇలా కూడా గొడవ పడతారా..? అంటూ మా ఎన్నికలతో స్పష్టమయింది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.

మోహన్ బాబు ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఆర్కే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. మా ఎన్నికలతో చిరంజీవికి దూరం కాబోతున్నారా అని అడగడంతో.. మోహన్ బాబు ఇప్పటికీ, రేపటికి ,ఎప్పటికైనా చిరంజీవి నా స్నేహితుడు.. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ పిల్లలను నా పిల్లలుగానే భావిస్తాము.. ఒకవేళ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పోటీ చేయడానికి వచ్చి ఒకవేళ నాతో మా ఎన్నికల గురించి ప్రతి స్పందిస్తే, కచ్చితంగా విష్ణు ని ఉపసంహరించుకోవాలని చెబుతానంటూ తెలిపాడు మోహన్ బాబు. మోహన్ బాబు కి , చిరంజీవి కి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఒక్కమాటలో తేలిపోయింది.