మా అన్నయ్య అలాంటివాడు కాదంటున్న నాగబాబు..?

మా ఎన్నికలు జరిగినప్పుడు నుంచి చాలా రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలలో మా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించిన నాగబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్న అన్నయ్యకు సినీపరిశ్రమలో పెద్దరికం గా వ్యవహరించాలని ఆలోచన లేదని, పెదరాయుడుల సింహాసనంపై కూర్చోవాలన్న తపనకానీ లేదన్నారు.

చిరంజీవికి అంత అహంకారం కూడా లేదని తెలియజేశాడు. పరోక్షంగా మోహన్ బాబు ను ఉద్దేశించి ఈ మాటలను అన్నట్లుగా సమాచారం.పెదరాయుడు అనే పదం మోహన్ బాబు సినిమా కు సంబంధించినది. అందుచేతనే ఆయన అని అన్నారు అన్నట్లుగా భావిస్తున్నారు. ఇక ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సినీ పెద్దలు చిరంజీవి మోహన్ బాబు వారు వస్తే కలిసి మాట్లాడుకోవచ్చు అని తెలియజేశాడు.

అయితే వీరిద్దరిలో సినీ పెద్ద ఎవరనే దాని మధ్య పోటీ ఏమైనా జరుగుతుందా? అనే ప్రశ్నకు మోహన్ బాబు ఈ విధంగా తెలియజేశాడు.. పెద్ద అంటే గురువు దాసరి నారాయణరావు అని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, తెచ్చి పెట్టుకుంటే వచ్చేవి కావని వాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై నాకు ఎలాంటి కౌంటర్ ఇస్తారని విషయంపై చాలా ఆసక్తికరంగా ఉన్నారు విశ్లేషకులు.