కిక్కెక్కించేలా ఉన్నా..మధుర వైన్స్ సినిమా ట్రైలర్..!

October 13, 2021 at 9:09 pm

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో వరస పెట్టి చిన్న సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పుడు కూడా మధుర వైన్స్ అనే పేరుతో ఒక రొమాంటిక్ యాక్షన్ చిత్రం సినిమా అక్టోబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కొద్ది గంటల ముందు ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. ప్రేక్షకుల ఆదరణ బాగా పొందింది.

ఈ సినిమాని డైరెక్టర్ జయ కిషోర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నవీన్ నటిస్తున్నాడు. హీరోయిన్గా సీమ చౌదరి నటిస్తోంది. ఈ సినిమాలో చాలా మంది ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..రొమాంటిక్, వైలెన్స్ తో కూడిన సినిమా గా కనిపిస్తోంది. ఇక ఇందులోని హీరో మందుకి బానిస అవ్వడం మనం గమనించవచ్చు. అయినా కూడా హీరోయిన్ అతన్ని ప్రేమిస్తుంది.

ఇక ఈ సినిమాలోని హీరోయిన్ ప్రతి డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరో ప్రేమ గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశాడు. ఇప్పుడున్న సమాజంలో ప్రేమ అనే పదాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి పనులను పూర్తిగా ట్రైలర్లో వివరించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 కిక్కెక్కించేలా ఉన్నా..మధుర వైన్స్ సినిమా ట్రైలర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts