హృతిక్ రోషన్ కి కౌంటర్ ఇచ్చిన కంగానా..ఎందుకో తెలుసా?

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంలో బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలిచారు. ఇది తాజాగా హీరో హృతిక్ రోషన్ కూడా ఆర్యన్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఈ విషయంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హృతిక్ రోషన్ కి కౌంటర్ ఇవ్వడంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందులో ప్రస్తుతం ఆర్యన్ కి డిపెండ్ చేయడానికి మొత్తం మాఫియా రంగంలోకి దిగింది. మనం తప్పులు చేస్తాం కానీ వాటిని గొప్పగా చెప్పుకొం.

ఈ డ్రగ్స్ కేసు వల్ల కలిగే ఇబ్బందులు అతని దృక్పథాన్ని మారుస్తాయనీ నేను గట్టిగా నమ్ముతున్న.. కానీ అతను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పడం మంచిది కాదు అని కంగనా, ఘాటుగా విమర్శించింది. అయితే భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత హృతిక్ తో కంగనా డేటింగ్ చేసిన తెలిసిందే. ఆ తరువాత కొన్ని అభిప్రాయ భేదాలతో ఈ కపుల్ విడిపోయారు. అప్పటినుంచి ఒకరిపై ఒకరు ఏదో ఒక విషయంలో కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. హృతిక్ రోషన్ ఆర్యన్ కి సపోర్ట్ గా పోస్టు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే కంగనా కూడా స్టొరీ పెట్టింది.

Share post:

Latest