కథ లేదు కానీ బాలయ్యతో సినిమా పక్కా అంటున్న టాలీవుడ్ డైరెక్టర్..!

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతుంది నట్లు గా సమాచారం. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ బి.గోపాల్ తెలియజేశాడు.తాజాగా ఈయన తెరకెక్కించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో బి.గోపాల్ బాలయ్య సినిమాపై స్పందించారు.

- Advertisement -

బాలయ్య బాబుతో త్వరలోనే ఒక సినిమా చేస్తానని.. మంచి కథ కోసం వెతుకుతున్నాను అని కొన్ని కథలు విన్నప్పటికీ ఏ కథను లాక్ చేయాలనే విషయంలో ఆలోచిస్తున్నాను అని తెలియజేశాడు గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్లో నాలుగైదు సినిమాలు వచ్చినప్పటికి అందులో సమర సింహారెడ్డి నరసింహనాయుడు వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.

ఇక మరొక సారి వీరి కాంబినేషన్లో సినిమా అనగానే.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉండే కదనే చేస్తారని టాక్ వినిపిస్తోంది.డైరెక్టర్ బి.గోపాల్ కూడా యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ మూవీ నటించాడు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం గా ఉంది.ఆ తర్వాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు ఆ తర్వాత బి.గోపాల్ తో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

Share post:

Popular