బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం, విక్రయాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్డులో హాజరు పరచగా.. షారుఖ్ తనయుడికి బెయిల్ ఇప్పించాలని ఎంతో ప్రయత్నించారు.
కానీ, ముంబై కోర్డు ఆర్యాన్ ఖాన్‌కు బెయిల్ నిరాకరించింది. అలాగే ఆర్యాన్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఎస్సీబీకి మరో మూడ్రోజుల కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ఆర్యన్ దోషిగా తెలితే.. అతడికి పదేళ్ల శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు.
ఆర్యన్‌తోపాటు అరెస్ట్ అయిన మరో ఏడుగురిపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సీ), 20 (బీ), 27 రెడ్ విత్ సెక్షన్ 35లు నమోదు చేశారు. అలాగే వీరి అరెస్ట్ సందర్భంగా 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 ట్యాబ్లెట్లను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ ఆర్యన్ దోషిగా తేలితే.. అతడిపై ఉన్న సెకెన్ల ప్రకారం ఖచ్చితంగా పదేళ్లు శిక్ష మరియు లక్ష జరిమానా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.