అనాధల రాత మారుస్తా అంటున్న గీత సినిమా?

వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా ఆర్ రావు దర్శకత్వంలో హెబ్బా పటేల్, సునీల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం గీత.మ్యూట్ విట్నెస్ అన్నది ఇందులో ఉపశీర్షిక. గ్రాండ్ మూవీస్ పతాకం పై ఆర్ రాచయ్య నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో సాయికిరణ్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను సంచలన దర్శకులు వి.వి వినాయక్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో రామ్ కార్తీక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ల భరణి, సంధ్యా జనక్ ఇంకా పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాధల కోసం పోరాడే ఒక మూగ యువతిగా చాలెంజింగ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య, లలిత, ప్రియా, అప్పారావు, దుర్గారావు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Share post:

Latest