మారేడుపల్లిలో హనుమాన్ షూటింగ్.. జనాలంతా గుమిగూడి?

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్ఙా హీరోగా నటిస్తున్న సినిమా హనుమాన్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వీడియోకి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఆంజనేయస్వామి స్ఫూర్తితో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ తెలుగులో ఎన్టీఆర్ సూపర్ మేన్ తర్వాత వస్తున్న రెండో సూపర్ హీరో మూవీ అవడం విశేషం. జాంబి రెడ్డి సినిమాతో తేజ ని హీరోగా ప్రమోట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు రెండో సినిమా హనుమాన్ సూపర్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయడంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి, పాడేరు ప్రాంతంలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే పాటలు చిత్రీకరణ సన్నివేశాలు జరుగుతుందని తెలుస్తోంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన లొకేషన్ ఫొటోస్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు మూవీ మేకర్స్. అందులో దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ అందమైన లోకేషన్స్ లో దేని గురించో సీరియస్ గా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమాతో హీరో తేజ సజ్జా టాలీవుడ్ లో హీరోగా మంచి స్టార్ డమ్ తెచ్చుకుంటారని ప్రశాంత్ వర్మ నమ్మకంగా చెబుతున్నారు. మరి తేజ సజ్జ కెరీర్ ను ఈ సినిమా ఎలాంటి మలుపులు తిప్పుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Share post:

Latest