బిగ్‌బాస్ 5: ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్‌..బ్యాగ్ స‌ద్దేసేది ఆమేన‌ట‌..!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఐదో వారం పూర్తి కాబోతోంది. నిన్న శ‌నివారం కావ‌డంతో `కొండ పొలం` టీమ్‌ను తీసుకొచ్చిన హోస్ట్ నాగార్జున‌.. ఇంటి స‌భ్యుల‌ను బాగానే ఎంట‌ర్టైన్ చేశారు. అయితే ఈ వారం ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకోబోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Bigg Boss Telugu Season 5 | Zee News Telugu

ఐదో వారం యాంకర్‌ రవి, షణ్ముఖ్‌ జశ్వంత్‌, మానస్‌, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ మొత్తం తొమ్మిది మంది నామినేషన్‌లో ఉన్నారు. అయితే వీరిలో ప‌క్కాగా లోబో ఎనిమినేట్ అవుతాడ‌ని అంద‌రూ ఊహించారు. కానీ, అనూహ్యంగా ఐదో వారం హ‌మీదా బ్యాగ్ స‌ద్దేసిన‌ట్టు లీకుల వీరుల స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

బిగ్ బాస్ 5 : ఎలిమినేట్ అయ్యింది అతడు కాదు ఆమె..

సూటిగా సుత్తి లేకుండా మాట్లాడటంలో హమీదా దిట్ట. కాకపోతే ఆమె హౌస్‌లో ఎక్కువగా శ్రీరామచంద్రతోనే ఉండటం, మిగతావాళ్లను లెక్కచేయకపోడంతో ఆమెపై వ్య‌తిరేఖ‌త బాగా పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే ఆమెపై ఎలిమినేష‌న్ వేటు ప‌ట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest