గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!

October 2, 2021 at 4:28 pm

టాలీవుడ్ లోకి విలన్ గా వచ్చి హీరోగా ఎదిగిన హీరో గోపీచంద్. ఇక ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం సిటీ మార్ కూడా మంచి సాలిడ్ కం బ్యాక్ ను ఇచ్చింది గోపీచంద్ కు. గోపీచంద్ హీరోగా దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మాస్ చిత్రం..”ఆరడుగుల బుల్లెట్”ఈ సినిమా కోసం గోపీచంద్ అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా 2015 లో రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల చేత ఆగిపోయింది. కానీ అప్పటి నుంచి ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ అవుతుంది అనే వార్త బాగా వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా విడుదల కాలేదు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఆ మధ్య తిరిగి మళ్లీ థియేటర్లో విడుదల చేస్తారని ఆ మూవీ మేకర్స్ తెలియజేశారు. ఇక ఇప్పుడు చివరికి ఈ సినిమాని అక్టోబర్ 8న థియేటర్లోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది.

గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts