విడాకులు కన్ఫర్మ్ చేసుకున్న చైతన్య – సమంత.. ట్వీట్ వైరల్..!

గత కొన్ని రోజులుగా నాగచైతన్య – సమంత విడిపోతున్నారు అనే వార్తలు పుకార్లు గానే వచ్చాయని సమంత స్పందించినప్పటికీ , ఎట్టకేలకు నాగచైతన్య ఈ వార్తలన్నీ నిజమే నంటూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు కొంతమంది షాక్ కి గురవుతుండగా , మరికొంతమంది మంచి నిర్ణయం తీసుకున్నావు చైతన్య అంటూ చెబుతున్నారు..

ఒకసారి వైవాహిక బంధం లోకి వెళ్ళిన తర్వాత విడిపోవడం అంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో విడిపోయే వారికే తెలుస్తుంది.. ఇక నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. సమంత , నేను ఇద్దరం ఒకరికొకరు అర్థం చేసుకొని విడిపోవాలని అనుకుంటున్నాము.. మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది.. వైవాహిక బంధానికి మాత్రమే దూరంగా ఉంటున్నాము.. దయచేసి మా సమస్యను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను..

అభిమానులకు ,వెల్ విషర్స్ కు , కుటుంబ సభ్యులకు, మీడియా వర్గాలు కూడా చెబుతున్నది ఏమిటంటే..మా ఇద్దరి మధ్య జరుగుతున్న విషయాల గురించి కొద్దిరోజులు జోక్యం చేసుకోకుండా.. మాకు కొంచెం ప్రైవసీ కావాలి.. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి.. అంటూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు.. కానీ సమంత- నాగచైతన్య ఇలాంటి డిసిషన్ తీసుకోవడం తో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ లో మునిగిపోయింది.