గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి తల్లిగా ఆమే….!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రాన్ని మలయాళం నుంచి లూసీఫర్ అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ రానే వచ్చింది. అది ఏమిటంటే చిరంజీవి కి తల్లిగా గంగవ్వ నటిస్తోందన్నట్లుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం ఊటీ లో జరుగుతున్నది. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్గా మోహన్ రాజా వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నే వచ్చే సంవత్సరంలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్నాడు.