వింటే గూస్ బంప్స్ వచ్చేలా..’గనీ’ అంథమ్ లిరికల్ సాంగ్ విడుదల..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గనీ’. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ అంథమ్ సాంగ్ ఇవాళ విడుదలైంది. ‘నీ జగ జగడం వదలకురా.. కడవరకూ .. ఈ కధనగుణం అవసరమే ప్రతి కలకు..’ అంటూ లిరికల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.

రామజోగయ్య శాస్త్రి ఈ పాటను ఎంతో స్ఫూర్తి నింపేలా రాశారు. తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాటను సింగర్లు ఆదిత్య లైన్గర్, శ్రీ కృష్ణ, సాయి చరణ్, పృథ్వీ చంద్ర ఆద్యంతం ఆకట్టుకునేలా పాడారు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యానికి తమన్ బాణీలు అద్భుతంగా కుదరడంతో మ్యూజిక్ ప్రియులను ఈ పాట ఆకట్టుకుంటోంది.

గనీ సినిమాను అల్లు బాబి రెనైసెన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర,తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు వెంకటేష్ తో కలిసి ఎఫ్ 3 ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది.

Share post:

Popular