వ‌ర్కోట్ కాని ఎన్టీఆర్ మానియా..`ఎవ‌రు మీలో కోటీశ్వరులు`కు బిగ్ షాక్‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓవైపు వ‌రుస సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న రియాలిటీ షో `ఎవ‌రు మీలో కోటీశ్వరులు`కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌నదైన హోస్టింగ్‌తో ఈ షోను బాగానే హిట్ చేశారు ఎన్టీఆర్‌.

NTR to host Gemini TV's 'Evaru Meelo Koteeswarulu' | Indian Television Dot Com

ఆయ‌న హ‌యాంలో ఈ షో బాగానే రేటింగ్స్‌ను అందుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ద‌స‌రా ఎపిసోడ్‌కు మ‌హేష్‌ను కూడా తీసుకురాబోతున్నారు మేక‌ర్స్‌. అయితే ఇలాంటి త‌రుణంలో ఎవ‌రు మీలో కోటీశ్వరులుకు ఐపీఎల్ రూపంగా బిగ్ షాక్ త‌గిలిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐపీఎల్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి ఈ షో రేటింగ్స్ బాగా త‌గ్గిపోయాయ‌ట‌.

IPL 2021: Schedule, Tickets, Starting Date, Auction, Teams, Venues, And Latest News

ఈ ఏడాది ఐపీఎల్ బ్యాలెన్స్ మ్యాచులు యూఏఈలో జ‌రుగుతుండ‌గా.. వాటికి విశేష‌మైన రేటింగ్ ల‌భిస్తోంద‌ట‌. ఆ ఎఫెక్టే ఎవ‌రు మీలో కోటీశ్వరులుపై ప‌డింద‌ని, ఐపీఎల్ ముందు ఎన్టీఆర్ మానియా వ‌ర్కోట్ కావ‌డం లేదుని గుస‌గుస‌లు వినిపిస్తున్నారు. మ‌రోవైపు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్‌ను సైతం ఐపీఎల్ ప్ర‌భావితం చేస్తుంద‌ని టాక్‌.

Share post:

Latest