ఈ విజయం అందరి విజయం అంటున్న మోహన్ బాబు..!

మా ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు తొలిసారిగా విలేకరుల సమావేశం ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ భగవంతుని నిర్ణయం మన చేతుల్లో ఉండదు కేవలం కాలమే నిర్ణయిస్తుంది. దాదాపుగా నేను 17 సంవత్సరాల క్రితం ఇదే అక్టోబర్ నెలలో మా అధ్యక్షునిగా ఏకగ్రీవం అయ్యాను. ఇప్పుడు అదే అక్టోబర్ నెలలో నా కుమారుడు విష్ణు గెలవడం చాలా సంతోషంగా ఉంది.

- Advertisement -

కొంతమంది రెచ్చగొట్టాలని చూశారు. సింహం ఎప్పుడూ నాలుగడుగులు వెనక్కి వేసి.. ఆ తరువాత ఒకేసారి విజృంభిస్తోంది. వేదిక దొరికిందని ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడకూడదు. అలా అని మౌనంగా ఉన్నాం అని అసమర్థుడు అనుకోవద్దు. నిన్నటిది వేస్ట్.. ఈరోజు న్యూస్.. రేపు క్యూస్షన్ పేపర్ అని మోహన్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అదేవిధంగా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిసి అందరి సహకారం తీసుకోవాలని కోరాడు మోహన్ బాబు. మా అనేది ఒక కుటుంబం. అందరిదీ ఒకే పార్టీ అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.

Share post:

Popular