షారుక్‌ ప్రకటనలు నిలిపేసిన ఎడ్‌ టెక్‌ దిగ్గజం?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి సంబంధించిన ప్రకటనలను ఐపీఓ బౌండ్‌ టెక్‌ దిగ్గజం బైజూస్‌ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ ఖాన్ కుమారుడు అరెస్టయిన విషయం తెలిసిందే. ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులు మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం మరొకసారి తిరస్కరించిన నేపథ్యంలో బైజూ సంస్థ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎన్‌సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఒక అడ్వటైజ్మెంట్ స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలి ఒక బాధ్యత గల తండ్రిగా పిల్లలకు వివరించే ప్రకటనలు కావడంతో, ఒక బాధ్యతగల తండ్రి కొడుకు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోవడం ఏమిటి అంటూ విమర్శలు నేపథ్యంలోనే బైజూ సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.అలాగే ఈ విషయం పై వివరణ ఇవ్వడానికీ కూడా బైజు సంస్థ నిరాకరించింది.ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌లు ఆర్యన్‌ చిన్నపిల్లవాడు అతనికి బైలు ఇవ్వాల్సిందే అంటూ షారుక్‌ మద్దతు ఇస్తున్నప్పటికీ ఈ మాదక ద్రవ్యాల వ్యవహారం మాత్రం షారుక్‌ సినీ కెరియర్‌కి పెద్ద ఎదురు దెబ్బ. రాజకీయ నాయకులు ఒక్కసారిగా వారి పదవీ ఊడిపోతే వారికి అప్పటివరకు జరుగుతున్న రాజమర్యాదలన్ని ఏవిధంగా కనుమరుగైపోతాయో అలా ఈ సినీ స్టార్‌ల పరిస్థితి కూడా ఇంతేలా ఉంది.