ఇది చాలదా ఎన్టీఆర్ గొప్పతనం చెప్పడానికి.. అభిమాని కోరిక మేరకు..వీడియో వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు అంటే నీకు ఎంత ఇష్టమో మనకి తెలిసిన విషయమే. మీరు చూపించే ప్రేమ మర్యాద ఎనలేనిదని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో ముఖ్యంగా తారక్ అంటే అభిమానులకు కూడా చచ్చేంత ప్రేమ ఉందని తాజాగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చావు బతుకుల మధ్య ఉన్న ఒక అభిమాని కోరిక తీర్చాడు ఎన్టీఆర్.

అసలు వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లాలోని రాజ్యాలకు చెందిన కొప్పాడి మురళి ఎన్టీఆర్కు వీరాభిమాని. అయితే ఇటీవల కొప్పాడి మురళి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం జరిగింది. ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన కి ఇష్టాయిష్టాలను తెలుసుకుని ప్రయత్నం చేయగా.. ఆయనకు తన అభిమాన హీరో ఎన్టీఆర్ ఒకసారి మాట్లాడాలని ఉంది అని తెలియజేశారు.

ఈ విషయం ఎన్టీఆర్ కు చేరడంతో వెంటనే వీడియో కాల్ చేసి అభిమాని మురళి తో మాట్లాడాడు.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్టీఆర్ కోరుకున్నాడు.

Share post:

Latest