డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న యంగ్ హీరోయిన్స్..!

ముంబైలోని క్రూయిజ్ షిప్ లో జరిగిన ఒక రేవ్ పార్టీ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శాఖ అధికారులు మెరుపు దాడి చేసి , డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచేసింది.. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ లండన్‌ లో సెవెన్‌ వోక్స్‌ లో అలాగే యూనివర్శిటి ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి చేశాడు. సీతను ఇటీవల జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులకు చిక్కడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్క సారిగా షాక్ కు గురయింది. అంతేకాదు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ వైపు అడుగులు పడాలి అనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం తో షారుఖ్ ఖాన్ తీవ్రంగా కుంగి పోతున్నట్లు సమాచారం.

ఈ డ్రగ్స్ కేసులో కేవలం షారుఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మాత్రమే కాకుండా మహారాష్ట్ర బిజినెస్ మాన్ కూతురు ఉన్నట్లు తేలింది. అంతేకాదు వీరితో పాటు మరికొంతమంది హీరోయిన్లు కూడా ఈ రేవ్ పార్టీ లో డ్రగ్స్ కేసు కింద అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ హీరోయిన్లు మాత్రం డ్రగ్స్ కేసులో చిక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.