`మా` ఎన్నిక‌ల్లో ఇంకా ఓటు వేయ‌ని స్టార్ హీరోలు ఎవ‌రెవ‌రో తెలుసా?

హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ వ‌ద్ద మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మా సభ్యులు మొత్తం 925 మంది ఉండగా వారిలో 883 మంది ఓటు హక్కు ఉంది. అయితే ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలైయ్యాయి.

Huge provision for Movie Artists Association (MAA)

ఇప్ప‌టికే చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగబాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, వడ్డె నవీన్, సుమన్, సాయికుమార్, శ్రీకాంత్, ఆది సాయికుమార్‌, నరేష్, సుమన్, ఉత్తేజ్, జెనీలియా, రోజా, సుడిగాలి సుధీర్ త‌దిత‌రులు ఓటు వేశారు.

Vishnu Manchu to contest for MAA president against Prakash Raj- Cinema express

అయితే మా ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌ని స్టార్ హీరోలు ఇంకా చాలా మంది ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, నాగ చైతన్య, వరుణ్ తేజ్, రానాలు ఇంకా ఓటు హ‌క్కును వినియోగించుకోలేదు.