దేవుడి పాత్రలో సునీల్..కలిసొస్తుందా..?

కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్..ఇప్పుడేమో దేవుడి వేషధారణ..మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది.ఒకానొక సమయంలో హీరోగా తప్ప మరో పాత్రలో చేయనని చెప్పేసిన సునీల్ ఇప్పుడు తన ట్రాక్ మార్చుకున్నాడు..ఇప్పుడు పాత్ర ఏదైనా తనకు ఇమేజ్ వస్తుందంటే చాలు..ఆ పాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప లో సునీల్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక సారి దేవుడి పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా ఏంటి..? విశేషాలు ఏంటి ..?అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..

హెడ్స్ అండ్ టేల్స్ అనే టైటిల్ తో రూపొందే ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది. హెడ్స్ అండ్ టేల్స్ సినిమాలో శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించారు. కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్.రెడ్డి ఇప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుండి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా.

ఇకపోతే గర్ల్ ఫార్ములా అనే యూట్యూబ్ ఛాన‌ల్‌లో కంటెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న శ్రీవిద్య-దివ్య జోడీ ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి, మంగ పాత్రలో దివ్య శ్రీపాద నటించారు. మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు కమెడియన్ గా, హీరోగా, విలన్ గా తన సత్తా ఏంటో చాటిన సునీల్ ఇప్పుడు దేవుడి పాత్రలో ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే.

Share post:

Popular