నాని సినిమా నుంచి న్యూ అప్డేట్ …!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఎన్నో విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటికే కొత్త కొత్త జోనర్ లతో మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నాడు అయితే తాజాగా నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయి చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించగా సాయి పల్లవి కృతి శెట్టి మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదలైన నేపద్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం హిట్ కొట్టాలని నాని అభిమానులు, పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ శ్యామ్ సింగరాయి చిత్రం నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. అయితే డిసెంబర్ 24న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని, క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటిస్తూ, ఈ మేరకు నాని, సాయి పల్లవి కలిసి ఉన్న పోస్టర్ను రిలీజ్ చేసింది.

Share post:

Latest