మీడియాకు సెటైర్ వేసిన చిరంజీవి?

నేను తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గతంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు జరుగుతున్నాయి. సినిమా ఎన్నికలకు ఈ రోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, మీడియా పై చిన్న సెటైర్ వేసారు. మీ మీడియా కి మంచి మెటీరియల్ దొరికింది కదా అంటూ సెటైర్లు వేయడం గమనార్హం. లోపల సిచువేషన్ ఏవిధంగా ఉంది? మా ఎన్నికలలో ప్రత్యర్థులు మొదటిసారిగా విమర్శలు కురిపించుకుంటున్నారు దీనిపై మీరేమంటారు అని మీడియా ప్రశ్నించగా?

వాటి పై స్పందించిన చిరంజీవి మాట్లాడుతూ.. పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు ఒక్కోసారి మారుతుంటాయి. దానికి అనుగుణంగా మనం కూడా నేర్చుకోవాలి. మా ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో మా ఎలక్షన్ జరుగుతున్నాయి.

మీరు ఎప్పుడైనా ఇలా జరుగుతుందని ఊహించారా? గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా అని మీడియా ప్రశ్నించగా? మీ మీడియా కు మంచి మెటీరియల్ దొరికింది మీరు ఆనంద పడాలి కదా! ఇలాంటి సిచువేషన్ లో అంటూ సెటైర్లు వేసి.. ఇలాంటివి జరగకూడదు అని ఏమీ లేదు జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఈరోజు అలాగే జరుగుతున్నాయి అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Share post:

Latest