చిరంజీవి కీల‌క నిర్ణ‌యం..ఆ డైరెక్ట‌ర్‌కి బిగ్ షాక్‌..?!

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌`ను పూర్తి చేసి మెగాస్టార్ చిరంజీవి.. ప్ర‌స్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న `గాడ్‌ ఫాదర్‌` చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తైన వెంట‌నే చిరు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు.

Megastar Chiranjeevi Confirms A Film With Meher Ramesh

అయితే వీటిలో భోళ శంక‌ర్ మూవీనే మొద‌ట ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, తాజాగా చిరంజీవి మ‌న‌సు మార్చుకుని మెహ‌ర్ ర‌మేష్‌కు బిగ్ షాక్ ఇచ్చార‌ట‌. భోళ శంక‌ర్‌ సినిమాను వెన‌క్కి నెట్టి బాబీ సినిమాను మొద‌ట సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని చిరు నిర్ణ‌యించుకున్నార‌ట‌. అంతేకాదు, ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి మూహుర్తం కూడా పిక్స్ అయింది.

Chiranjeevi, Bobby join hands for Chiru 154. Mega update on actor's birthday - Movies News

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. నవంబరు 6న లాంఛనంగా హైద‌రాబాద్‌లో చిరు-బాబీల చిత్రం స్టార్ట్ కానుంద‌ట‌. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్టేనర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది. మైత్రీ మూవీస్ ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున నిర్మించబోతుండ‌గా..దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

Share post:

Latest