హాలీవుడ్ సింగర్ పై కన్నేసిన చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా, మోహన్ రాజాతో గాడ్ ఫాదర్, అలాగే బాబు డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ను పూర్తి చేసుకున్న చిరంజీవి, ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరు. ఈ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ఇందులో నటించే హీరో హీరోయిన్స్, మిగతా తారాగణం కు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో మరింత హైప్ క్రియేట్ చేసేందుకు హాలీవుడ్ పాప్ సింగర్ ను రంగంలోకి దించబోతున్నాడు తమన్. బ్రిట్నీ స్పియర్ తో ఒక పాటను పాడించడానికి తమన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆమెతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఈ సినిమా మేకర్స్ ఆమెకు భారీగా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగానే ఆమె ఒక పాటకి దాదాపుగా 20 నుంచి 30 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటోందని సమాచారం