బ‌న్నీ-బోయ‌పాటి సినిమాపై న్యూ అప్డేట్‌..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుండ‌గా..ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ.. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేయ‌నున్నాడు.

Boyapati Srinu to team up with Allu Arjun? - TeluguBulletin.com

దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాక‌పోయినా.. ఇటీవ‌ల అల్లు అర‌వింద్ ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ బోయపాటి నెక్స్ట్ మూవీని తమ బ్యానర్ లోనే అని తెలిపారు. దాంతో బ‌న్నీ-బోయ‌పాటి మూవీని క‌న్ఫార్మ్‌ చేసుకున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు ఈ మూవీపై ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బ‌న్నీతో బోయ‌పాటి ఓ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ తెరకెక్కించబోతున్నార‌ట‌.

Allu Arjun, Boyapati Srinu to reunite for a pan-Indian film?- Cinema express

గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన‌ ‘సరైనోడు’ మూవీ ఏ రేంజ్ లో హిట్టైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఈ సారి ‘సరైనోడు’ చిత్రాన్ని మించిన కథతో రాబోతున్నారని టాక్‌. అంతేకాదు, ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను బోయపాటి లాక్ చేశార‌ట‌. బ‌న్నీకి బోయపాటి చెప్పిన స్టోరీ లైన్ బాగా న‌చ్చింద‌ని..పుష్ప పూర్తి అయిన వెంట‌నే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక ఇది కూడా పాన్ ఇండియా లెవ‌ల్‌లోనే రూపొందించ‌నున్నార‌ని స‌మాచారం.

Share post:

Latest