దేవీ నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ నటి కాజోల్?

October 12, 2021 at 7:02 pm

ప్రస్తుతం దేశమంతటా కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఏ దేవాలయం లో చూసిన అమ్మవారు వివిధ రకాల అవతారాలలో దర్శనమిస్తున్నారు. అయితే దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను దేశమంతటా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు.

ఇందులో భాగంగానే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ దేవీ నవరాత్రి ఉత్సవాల ఈ సందర్భంగా సందడి చేసింది.

శరన్నవరాత్రి సందర్భంగా దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి ప్రత్యేక పూజలు పాల్గొంది.ఈ పూజకు కాజోల్ సాంప్రదాయ పద్ధతిలో ఆభరణాలు, పింక్ కలర్ సారీ లో హాజరయ్యింది.

అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దసరా వచ్చిందంటే ప్రతి ఏడాది ప్రత్యేక పూజలతో కాజోల్ వేడుక చేస్తారు.

అలాగే మహా సప్తమిని పురస్కరించుకొని ఈ ఏడాది కూడా కాజోల్ ముంబైలో దుర్గాపూజ మండలంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాజల్ తో పాటు గా ఆమె కజిన్ నటి షర్బని ముఖర్జి ఈ వేడుకలో పాల్గొంది.

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ నటి కాజోల్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts