బిగ్ అప్డేట్ : RRR సినిమా నుంచి వీడియో విడుదల..!!

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలనుకున్న ఏదో ఒక ఆటంకం రావడం లేదా పెద్ద హీరోల సినిమాలు పోటీ రావడంతో ఈ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.. కానీ ఎట్టకేలకు ఈసారి ఎలాగైనా సరే ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలని భీష్మించుకు కూర్చున్నాడు రాజమౌళి.. అందులో భాగంగానే వచ్చే సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7వ తేదీన ఘనంగా సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.

- Advertisement -

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముంబైలోని అంధేరి లో ఉన్న సిటీ మాల్ థియేటర్.. ఆర్ ఆర్ ఆర్ ఫ్లెక్సీల తో థియేటర్ చుట్టూ మారుమ్రోగుతోంది ఈ సినిమా. ఇక ముంబై వాసులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతటి ఘనవిజయాన్ని, రికార్డులను సృష్టిస్తుందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.

Share post:

Popular