వాళ్ళిద్దరిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్..నటరాజ్ మాస్టర్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ నుంచి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. 4వ వారం ఎలిమినేట్ అయ్యే తట్టాబుట్టా సర్దుకుని బయటికి వచ్చేశాడు. ఇక కొంతమంది అభిమానులు నటరాజ్ మాస్టర్ ఇంకొద్ది రోజులు హౌస్ లోనే ఉంటే ఎంటర్టైన్మెంట్ దొరికేది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే నట్రాజ్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. నేను నాలా ఉంటే జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నా కానీ గొర్రె కసాయి వాడినే నమ్మినట్టు దొంగ నాటకాలు వేసే వాడిని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.

హౌస్ లో ఎవరు వారిలా ఉండకుండా జనాలను ఫూల్ చేస్తున్నారని అలాంటి కంటెస్టెంట్ లకు మాత్రమే జంతువుల పేర్లు పెట్టానని తెలిపాడు.రవి లహరి తన వెనకాల పడుతోందని ఇంకో లేడి కంటెస్టెంట్ తో చెప్పడం తప్పని విమర్శించాడు. ఇదే గుంట నక్క వేశాలు అంటూ అతని పరువు తీశాడు. తనకు గతంలో పలుమార్లు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని, కానీ ఈ సారి అన్ని కుదిరి హౌస్ లోకి వెళ్లాలని తెలిపాడు.

బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత మూడు లక్షలకు పైగా పారితోషికం అందుకున్న తెలిపాడు. ఇక ఐదో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి విశ్వ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నట్రాజ్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. అలాగే మానస్, శ్రీ రామ్ లలో ఎవరైనా ఒకరు బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశం ఉందని తెలిపాడు.

Share post:

Latest