బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలకరించిన కొండపొలం టీమ్?

బిగ్ బాస్ రియాల్టీ షో రోజు రోజుకి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారం కూడా ముగింపుకు వచ్చింది.ఇప్పటికే నలుగురు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈసారి అత్యధికంగా 9 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్‌ అవుతారా? అన్న ఆసక్తి నెలకొంది. ఇక బుల్లితెర ప్రేక్షకులకు డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు కొండపొలం సినిమా టీమ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ను పలకరించింది.

యంగ్‌ హీరో వైష్ణవ్‌తేజ్‌, దర్శకుడు క్రిష్‌ బిగ్‌బాస్‌ స్టేజీమీదకు వచ్చి కంటెస్టెంట్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ.. కొండపొలం చిత్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు వెల్లడించాడు.ఈ సందర్భంగా నాగార్జున వైష్ణవ్ తేజ్ ని పలు ప్రశ్నలు అడగాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ ఇష్టమా? హమీదా ఇష్టమా?’ అని శ్రీ రామ్ ని ప్రశ్నించగా అతడు బిగ్‌బాస్‌ టైటిల్‌ అని సమాధానం ఇచ్చాడు.

ఇది విన్న క్రిష్‌ నేనైతే హమీద గారు ముఖ్యం అనేవాడిని అని బదులివ్వడంతో అందరూ చిరునవ్వులు చిందించారు.ఇక కిచెన్‌లో జెస్సీ, శ్రీరామ్‌ మధ్య జరిగిన ఫైటింగ్‌ గురించి సైతం చర్చించాడు. అంత రఫ్‌గా ఎలా ఆడావని శ్రీరామ్‌ను నిలదీయగా అతడు తాను కొట్టలేదని దీర్ఘం తీయడంతో వీడియో ప్లే చేయించాడు నాగ్‌. మరి కిచెన్‌లో జరిగిన లొల్లిలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Share post:

Latest