ఆయ‌న జీవిత చరిత్ర తీసి తీరుతానంటున్న బండ్ల‌న్న‌..!

టాలీవుడ్ కమెడియన్, నిర్మాత‌ బండ్ల గ‌ణేష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న‌ హీరోగా రాబోతోన్న సినిమా గురించి అందరికీ తెలిసిందే. డేగల బాబ్జీ అంటూ బండ్లన్న‌ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రయూనిట్ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది.

- Advertisement -

Image

ఇదిలా ఉంటే.. తాజాగా బండ్ల గ‌ణేష్ గణపతి సచ్చిదానంద స్వామివారి జీవితచరిత్రను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని ప్రకటించారు. `శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నన్ను వారి జీవిత చరిత్ర తీయమని ఆదేశించినందుకు నాకు చాలా గర్వముగా ఉన్నది… ఇది నా అదృష్టం… నేను ఒక మహా యజ్ఞం లాగా భక్తుల ముందు ఉంచుతాను..` అంటూ ట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్ మ‌రో ట్వీట్‌లో..

Image

`అప్పాజీ జీవిత చరిత్ర నేను తీసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు..` అంటూ పేర్కొన్నారు. దాంతో బండ్ల గ‌ణేష్ ట్వీట్లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ఇక ప్రాజెక్ట్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.

 

Share post:

Popular