సామ్- నాగ్ విడాకుల విషయంలో జ్యోతిష్యుడు మాటలు..?

సమంత,నాగ చైతన్య విడాకుల విషయం గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకు ఈ జంట తెరదించేశారు. వీరిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ దారులు వేరైనా తమ మధ్య ఉన్న స్నేహబంధం ఎప్పుడూ అలాగే ఉంటుందని తెలిపారు. ఈ ఘటనతో గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని తేలిపోయింది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో మరొకసారి వేణు స్వామి మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ సమంత నాగ చైతన్య మిగిలిపోతారని నాకు మూడేళ్ల క్రితమే తెలుసు. వారిద్దరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. సమంత జాతకాన్ని బట్టి చూస్తే ఆమె వివాహ బంధం ఎక్కువ కాలం నిలవదు. అలాగే వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాను. ఆ సమస్యలు ఎలాంటివి అంటే వారిద్దరూ విడిపోవచ్చు, లేదా సంతానం కలగకపోవచ్చు, పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు వస్తాయి అని ముందే తెలిపాను అని తెలిపారు. సమంత అమావాస్యనాడు పుట్టిందని.. దీనితో చైతు కి ఇలాంటి సమస్యలు వస్తాయి అని ముందే చెప్పాను. సినిమాల విషయానికి వస్తే ఇటువంటి ఇబ్బంది ఉండదు బాగానే రాణిస్తారు, సమంత కూడా పెళ్లి తర్వాత కంటిన్యూ అవుతుందని ముందే చెప్పాను అంటూ ఇంటర్వ్యూలో తెలిపారు.