అరుదైన గౌరవం దక్కించుకున్న రోజా కూతురు..!

అలనాటి హీరోయిన్ రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రోజా. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే గా రోజా ఉన్నది. ఇక రోజా కి సెల్వమణి తో వివాహం అయిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది. అలా ఎదుర్కొంటున్న తరుణంలోనే తనకి ఒక కూతురు ఒక కొడుకు జన్మించారు. అయితే రోజా కూతురు ఇప్పుడు ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది ఆ వివరాలను చూద్దాం.

రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ఇన్ఫ్లూయెన్సర్-UK మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫోటోను ముద్రించారు. ఇక రచయితగా, ఎంటర్ప్రెన్యూర్ ,ప్రోగ్రామర్ గా,సమాజం కోసం పాటుపడుతున్న యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైనట్లు ఆ సంస్థ ప్రకటించింది.దీంతో అన్షు.. స్పందిస్తూ తనకు అలా ఇప్పటికి నెరవేరింది అంటూ సంతోషపడింది.

ఇటీవలే బర్న్ అచీవర్ అనే మ్యాగజైన్ కవర్ పై క్వీన్ ఆఫ్ టాలెంటెడ్గా ఆమె ఫోటోను వేయడం జరిగింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు