బిగ్ షాక్ ఇవ్వ‌బోతున్న అమెజాన్‌ ప్రైమ్..ఆందోళ‌న‌లో స‌బ్‌స్క్రైబ‌ర్లు?!

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు భారీ క్రేజ్ పెరిగి పోయింది. సినిమా థియేటర్లు లేక పోవడంతో అందరు కూడా ఓటీటీలపైనే పడ్డారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త షోల‌తో ఓటీటీలు సైతం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ త‌న స‌బ్‌స్క్రైబ‌ర్లకు బిగ్ షాక్ ఇవ్వ‌బోతోంది.

Amazon Prime Video: Pricing, content, and more - Android Authority

ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీ+ డిస్నీ హాట్‌స్టార్‌ ధరల్ని పెంచినట్లే త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ధరలను 50 శాతం పెంచనుంద‌ట‌. ప్రస్తుతం ఏడాదికి అమెజాన్ ప్రైమ్‌ ధర రూ.999 ఉండగా…పెరగనున్న ఛార్జీలతో అది కాస్తా రూ. 1499కి చేరనుంది.

All The Premieres Of Amazon Prime Video In August 2021 - Bullfrag

అలాగే క్వార్టర్టీ సబ్‌స్ర్కిప్షన్‌ ధర రూ. 329 ఉండ‌గా..50 శాతం పెరుగుద‌ల‌తో రూ. 459కి చేరుకునుంది. ఇక నెలవారీ సబ్‌స్ర్కిప్షన్ ధ‌ర రూ.129 నుంచి రూ.179కి పెర‌గ‌నుంది. అయితే భారీగా ధ‌ర‌లు పెర‌గుతుండంతో.. అమెజాన్ ప్రైమ్‌ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకున్న వారు మాత్రం కాలపరిమితి పూర్తయ్యే వరకు ఉపయోగించుకోవ‌చ్చు.

Share post:

Latest