బిగ్‌బాస్ 5: ఈ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేష‌న్ ప‌క్కానా..?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ మ‌రియు ప్రియ‌ను ఎలిమినేట్ అవ్వ‌గా.. హౌస్‌లో ఇంకా 12 మంది మిగిలారు. ఇక వీరిలో ఈ వారం లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్‌లు నామినేట్ అయ్యారు.

Bigg Boss Telugu: Exclusive update on week 8 nominations

అయితే ఈసారి ఎలిమినేషన్‌ వార్‌ వన్‌సైడ్‌ అవనున్నట్లు కనిపిస్తోంది. అవును, నామినేష‌న్‌లో ఉన్న ఆ ఆరుగురిలో లోబో ఎలిమినేట్ అవ్వ‌డం ప‌క్కా అంటున్నారు నెటిజ‌న్లు. నిజానికి లోబో ఆరో వారమే ఎలిమినేట్ అయ్యుండేవాడు. కానీ, సీక్రెట్‌ రూమ్ ద్వారా బిగ్‌బాస్ అతడిని ఆ గండం నుంచి గట్టెక్కించారు.

Netizens troll Bigg Boss contestant Lobo

అయితే ఈ వారం మాత్రం లోబోను ఎవ్వ‌రూ కాపాడ‌లేర‌ని అంటున్నారు. పైగా ఇక సీజన్‌ ప్రారంభమైన మొదట్లో లోబో బాగానే ఎంటర్‌టైన్‌ చేసినా రానురానూ డల్‌ అయిపోయాడు. టాస్కుల్లోనూ ఎక్కడా పనితనం చూపకపోవడం అత‌డికి మ‌రింత మైన‌స్‌. ఈ నేప‌థ్యంలోనే ఎనిమిదో వారం లోబోనే ఎలిమినేట్ కానున్నాడ‌ని ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.