స‌మంతకు అండ‌గా మంచు విష్ణు..వాళ్ల‌కు స్ట్రోంగ్ వార్నింగ్‌!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్ స‌మంత‌-నాగ‌చైత‌న్య‌లు ఇటీవ‌ల విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వారిద్ద‌రే సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. దాంతో ప‌లు యూట్యూబ్ ఛానెల్స్ స‌మంత‌ను టార్గెట్ చేస్తూ.. ఆమెపై లేనిపోని దుష్ప్రచారాలు చేశారు. వాటిని స‌హించ‌లేక‌పోయిన సామ్‌.. కోట్లు మెట్లెక్కి స‌ద‌రు యూట్యూబ్ చానెల్స్‌పై పరువునష్టం దావా కేసు వేసింది.

- Advertisement -

The exact reason behind Samantha and Naga Chaitanya divorce

ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. అయితే ఇలాంటి త‌రుణంలో స‌మంత‌కు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) నూత‌న అధ్య‌క్షుడు మంచు విష్ణు అండ‌గా నిలిచాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంట‌నే మంచు విష్ణు.. ‘మా’ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌(WEGC)ను ఏర్పాటు చేశారు. మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుంది.

Manchu Vishnu : I have today assumed the office of the President of MAA

ఇక ఈ విష‌యాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించిన అనంతరం మంచు విష్ణు పలు యూట్యూబ్‌ ఛానళ్లుపై మండిపడ్డారు. నటీమణులు, హీరోయిన్లపై పై రూమ‌ర్లు క్రియేట్ చేసి అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు విష్ణు. న‌టీమణులు, హీరోయిన్లు మనకు ఆడపడుచులు.. వీరికి ఎటువంటి కష్టం వచ్చినా వారిని ఆదుకోవడానికి నేను ముందుంటాను..మనం వారిని గౌరవించాలి.. హీరోయిన్ల పై అసభ్యకరమైన వీడియోలు ఎవరైనా పెట్టినట్లయితే వదిలి పెట్టేది లేదు అంటూ యూట్యూబ్ ఛానెల్స్‌ వాళ్ల‌కు విష్ణు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు.

 

Share post:

Popular