స్కూల్ ఆయా నీచ‌పు బుద్ధి.. 8 ఏళ్ల బాలుడితో అలా చేసింద‌ట‌, చివ‌ర‌కు..?

మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడి చేయడం వంటి ఘటనలు ప్ర‌తి రోజూ ఎన్నో చూస్తుంటాం. కానీ, హైద‌రాబాద్ న‌గ‌రంలో సీన్ రివ‌ర్స్ అయింది. ఓ స్కూల్ ఆయా 8 ఏళ్ల బాలుడిపై లాంగిక దాడికి పాల్ప‌డి నీచ‌పు బుద్ధిని చూపించుకుంది. అయితే ఈ ఘ‌ట‌న 2017లో జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఈ కేసులో నింధితురాలికి ఇప్ప‌టికి శిక్ష ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

- Advertisement -

Woman sentenced to 20 years in jail for sexually abusing boy | Sambad  English

బార్కాస్‌ ఏరియాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో జ్యోతి అనే పాతికేళ్ల మహిళ 2017లో ఆయాగా చేరింది. ఆ స్కూల్‌లోనే మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడిపై ఆమె లైంగిక వేధింపులకు పాల్పడింది. పిల్లాడు బాత్‌రూమ్‌లోకి వెళ్లగానే వెనకాల వెళ్లి జ్యోతి..అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టింది. ఈ విషయం ఎవరికి చెప్పవద్దంటూ బాలుడిని హింసించింది. ఈ క్ర‌మంలోనే సిగరెట్‌తో చేతులపై కాల్చి భయపెట్టింది.

Crime News: 'వీర్యం' సిరంజీతో మహిళలపై దాడి

శరీరంపై సిగరెట్ వాతను గమనించిన తండ్రి ఏమి జరిగిందని గట్టిగా అడగడంతో… బాలుడు ఏడుస్తూ జరిగిందంతా తల్లిదండ్రులకు వివరించాడు. దాంతో జ్యోతిపై బాలుడి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిరాదు చేయ‌గా..పోక్సో కింద కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు నాలుగేళ్ల విచారణ అనంతరం జ్యోతికి 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. మొత్తానికి బాలుడిపై నీచంగా ప్ర‌వ‌ర్తించిన జ్యోతి చిర‌వ‌కు జైలు పాలైంది.

Share post:

Popular