ఆ వెబ్ సిరీస్ ను రీమేక్ చేస్తున్న సురేష్ బాబు..?

టాలీవుడ్ లో అందులోనూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రిమేక్ ల బాట పట్టాయి. ఒక భాషలో హిట్టు కొట్టిన సినిమాను వేరే భాషలో తీయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. దర్శకులు కూడా అలానే చేస్తున్నారు. ఈ తరుణంలో వారి చూపు వెబ్ సీరిస్ ల మీద కూడా పడింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఓ వెబ్ సీరిస్ ను రిమేజ్ చేయడానికి సిద్దమయ్యారు. కొరియన్ వెబ్ సీరిస్ ను ఆయన తెలుగులోకి తేవాలని చూస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ కు ఆ వెబ్ సీరిస్ బాగా నచ్చడంతో దానిని రిమేక్ చేయాలని చూస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు ఉండే సెంటిమెంటల్ స్టోరీ గా స్పానిష్ వెబ్ సిరీస్ ఉండటంతో వెంకటేష్ దానిని తెలుగులోకి రిమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దానిని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని సురేష్ బాబు ఆలోచిస్తున్నారు. త్వరలోనే దానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి.