హీరో విశాల్ పాన్ ఇండియా సినిమా.?

తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రీతిలో పేరును సంపాదించుకున్నాడు. వెనక ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పందెం కోడి, పొగరు,భరణి,వాడు వీడు,అభిమన్యుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే హీరో విశాల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సినిమాకు ఏ వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో హీరో విశాల్ సరసన హీరోయిన్ దాసు సునైనా అది ఇస్తుంది. రానా ప్రొడక్షన్ పతాకంపై రమణ,నంద నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చెన్నై లో మొదలై ప్రారంభమయ్యింది. సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి కారణమయ్యే ఒక అంశం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో ఒకే టైటిల్ వుంటుంది. ఇప్పటివరకు చాలా యాక్షన్ సినిమాలలో చూసిన విశాల్ నూ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో యాక్షన్ సీక్వెన్స్ ను చూస్తారు . సెకండాఫ్ లో 45 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాల గోపి చేస్తున్నారు.

Share post:

Popular