ఫ‌స్ట్ మూవీతోనే హిట్ కొట్టి ఆ త‌ర్వాత ఫేడ‌వుట్ అయిన‌ హీరోలు వీళ్లే!

ఫ‌స్ట్ మూవీతోనే హిట్ కొట్టి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుని, ఆ తర్వాత అర్ధంతరంగా ఫేడ‌వుట్ అయిపోయిన హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొంద‌రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Dimpled hero Venkat is back - Telangana Today English | DailyHunt

1. హీరో వెంక‌ట్‌: బిజినెస్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వెంక‌ట్ తొలి చిత్రం `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`. అక్కినేని నాగేశ్వర రావు ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చినఈ సినిమాతో హీరో గా పరిచయం అయినా వెంకట్.. ఫ‌స్ట్ మూవీతోనే హిట్ కొట్టి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత ఈయన హీరో గా వరుస పెట్టి సినిమాలు చేసిన కూడా ఎందుకో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. దాంతో ఫేడ‌వుట్ అయిన వెంక‌ట్ ఈ మ‌ధ్యే మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.

Hero Jai Akash Joins TRS | Anandam Fame Aakash into Politics | Home Minister Nayani Narasimha Reddy | Cinema Township

2.హీరో జై ఆకాష్‌: శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన `ఆనందం` సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఆకాష్‌.. తొలి చిత్రంతోనే సూప‌ర్ హిట్ కొట్టి అంద‌రి చూపుల‌ను త‌న‌వైపుకు తిప్పుకున్నాడు. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆకాష్ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయాడు.

Venu Thottempudi turns 44: Foot-tapping video songs of the 'Chiru Navvuto' star | Telugu Movie News - Times of India

3.హీరో వేణు: స్వయంవరం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన వేణు.. మొద‌టి సినిమాతో హిట్ కొట్టి త‌న‌కంటూ స్పెష్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ఈయ‌న‌.. క్ర‌మంగా ఫేడ‌వుట్ అయిపోయాడు.

Aditya Om - IMDb

4.హీరో ఆదిత్య ఓం: `లాహిరి లాహిరి లాహిరిలో` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఫ‌స్ట్ మూవీతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఎన్నో తెలుగు చిత్రాలు చేసిన‌ప్ప‌టికీ స్టార్ హీరో రేంజ్‌కు ఎద‌గ‌లేక‌పోయాడు. హీరోగా స‌క్సెస్ కాలేక‌పోయిన ఈయ‌న డైరెక్ట‌ర్‌గా ప‌లు సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌ను తెర‌కెక్కించారు. ఇక ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఆదిత్య ఎన్జీవో సంస్థను నడుపుతూ ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

90s Heartthrob Retires, Says Things Got Boring -

5.హీరో అబ్బాస్‌: ఈయ‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్రేమ దేశం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్‌..తొలి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. అప్పట్లో వచ్చిన ఈ సినిమా ఎన్నో సంచనాలను సృష్టించింది. ఈ సినిమాతో అబ్బాస్ కు ఫ్యాన్స్ విపరితంగా పెరిగారు. ఆ త‌ర్వాత‌ తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన అబ్బాస్..చివ‌ర‌కు ఫేడ‌వుట్ హీరోగా మిగిలిపోయాడు.

Share post:

Latest