ఆ హీరోయిన్ కు ప్రియుడు దొరికాడట.. ఎవరో తెలుసా?

సోనమ్ బజ్వా  ఆటాడుకుందాం రా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమాతో ఆమె అనుకున్న విధంగా గుర్తింపుని అందుకోలేకపోయింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమై తమిళం, పంజాబీ సినిమాలో వరుస సినిమాల్లో నటించింది. అయితే టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే అప్పట్లో ఈమెకు క్రికెటర్ కేఎల్ రాహుల్ కి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వినిపించాయి. ఒక సారి ఆమె తన ఫోటోని షేర్ చేస్తూ నీ కోసం ఎదురుచూస్తున్నా ఇవ్వగా.. అందుకు స్పందించిన రాహుల్ ఒక్క ఫోన్ కొడితే చాలు అక్కడే వాలిపోతా అని కామెంట్ చేశారు. దీంతో వారిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అనుకున్నారు. ఆ తర్వాత వారిద్దరిమధ్య బ్రేకప్ ఉండగా తాజాగా మరో వ్యక్తితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆమె ఇష్ట పడిన వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన వారు కాదని ముంబైలో ఉంటున్నాడని పైగా వీరి మధ్య డేటింగ్ నడుస్తోందని వార్తలు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ హీరోయిన్ కి ప్రియుడు దొరికేసాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Share post:

Latest