తన తల్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..!

మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు.. సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖ దర్శక ధీరుడు దాసరి నారాయణరావు సహాయంతోనే, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.. దాసరి నారాయణరావు కుటుంబం మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితులు.. ఎంతలా అంటే మంచు విష్ణు, విన్ని ని ప్రేమించినప్పుడు దాసరి నారాయణరావు దగ్గరుండి మోహన్ బాబును ఒప్పించి మరీ, వీరిద్దరికీ పెళ్లి జరిపించారు..ఇక మోహన్ బాబు తన గురువుగా దాసరి నారాయణరావును చూసుకుంటాడు అని చెప్పవచ్చు.

ఇటీవల మోహన్ బాబు ఆలీతో సరదాగా షో కి హాజరు అవుతున్న విషయం తెలిసిందే..250 ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా రానున్న మోహన్ బాబు తన తల్లి గురించి పలు వ్యాఖ్యలు చేయడంతో పాటు తన జీవితంలో పడిన కష్టాల గురించి కూడా తెలిపాడు.. ఇటీవల ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ..మా తల్లి కి ఐదు మంది సంతానం ..అందరూ అబ్బాయిలు కావడంచేత అమ్మకి ఇంటి పని వంట పనిలో ఎవరు సహాయం చేసే వాళ్లము కాదు.. పైగా అమ్మకి వినిపించదు.. ఏం చెప్పినా సరే చాలా గట్టిగా చెప్పాల్సి వచ్చేది.. ఎన్నో సమస్యలను ఎదుర్కొని, మా అన్నదమ్ములు అందరిని గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దింది.. మా తల్లి కి ఎప్పుడు రుణపడి ఉంటాము అని తెలిపాడు మోహన్ బాబు.https://youtu.be/eEuRXSq1j3A?t=1

Share post:

Latest