కొడుకు కోసం మళ్లీ కలిసిన అమీర్ ఖాన్ జంట?

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కిరణ్ రావు ల విడాకుల వ్యవహారం గురించి మనందరికీ తెలిసిందే. ఈ దంపతులు ఈ ఏడాది ఆరంభంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ జంట తమ కుమారుడు అజాద్ తో కలిసి బయటికి లంచ్ కి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ జంటకు ఆజాద్ అనే ఒక 9 ఏళ్ల కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత మొదటిసారిగా తమ కొడుకు కోసం ఈ దంపతులు బయటికి వెళ్లారు .

భారీ భద్రత మధ్య వచ్చిన ఆ దంపతులు భోజనం తరువాత ఓపికగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. విడిపోయిన కూడా ఈ దంపతులు ఇద్దరూ కలసి తాజాగా లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇది కుమారుడు కి సంబంధించిన అన్ని విషయాలలో ఇద్దరూ పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు గతంలోనే ప్రకటించారు. కాగా ఇటీవల సినిమా షూటింగ్ లడ్డాక్ లో జరుగుతున్న సమయంలో ఈ మాజీ జంట అక్కడి స్థానికులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Share post:

Latest