అమీర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ.. సమంత మిస్సింగ్?

దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం టీమ్ ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వచ్చారు. అమీర్ ఖాన్ కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి తో పాటు మరికొందరు అక్కినేని కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా ఫీలింగ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున అమీర్ ఖాన్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇది ఇలా ఉంటే అక్కినేని సమంత ఈ పార్టీలో కనిపించకపోవడంతో మరోసారి సమంత విషయంలో సోషల్ మీడియాలో వార్తలు మరి ఎక్కువగా వినిపిస్తున్నాయి.

సమంతకు అక్కినేని కుటుంబం తో విభేదాలు వచ్చాయి అంటూ వార్తలు వినిపించినా.. ఈ విషయంపై అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. పైగా సమంత ఒంటరిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటోంది. ఇలా ముఖ్యమైన ఈవెంట్ లకు హాజరు కాకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం తో విడాకుల విషయంలో మరింత ఆజ్యం నూరి పోసినట్లయింది. సమంత కూడా అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తుందని అక్కినేని అభిమానులు సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఒక్క మాటతో ఈ వార్తలన్నింటికి చెక్ పెట్టే దానికి ఎందుకు ఇలాంటి వార్తలతో రచ్చకెక్కుతున్నారు అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Share post:

Latest